హత్యకు స్కెచ్‌ | Ravi Chavali Movie SUPER SKETCH | Sakshi
Sakshi News home page

హత్యకు స్కెచ్‌

Jan 18 2018 5:16 AM | Updated on Jan 18 2018 5:16 AM

Ravi Chavali Movie SUPER SKETCH - Sakshi

‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్‌ స్కెచ్‌’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్‌ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్‌ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్‌) కీలక పాత్రలు చేశారు. ఎరోస్‌ సినిమాస్‌ సమర్పణలో బలరామ్‌ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్‌ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్‌ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్‌ మధ్య జరిగే కథ ఇది.

పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్‌ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్‌ అధికారిగా నర్సింగ్‌ నటన ఈ సినిమాకి హైలైట్‌. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్‌ స్క్రీన్‌ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్‌ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్‌ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్‌ ఫిల్మ్‌ అకాడమీ, కెమెరా:  సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల.

Advertisement
 
Advertisement
Advertisement