అందరూ కొత్తవాళ్లతో... | ratham movie first look motion poster teaser launch | Sakshi
Sakshi News home page

అందరూ కొత్తవాళ్లతో...

Aug 21 2018 12:17 AM | Updated on Aug 21 2018 12:17 AM

ratham movie first look motion poster teaser launch - Sakshi

గీత్‌ ఆనంద్, చాందినీ

గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘రథం’. వినోద్‌ సమర్పణలో రాజా దారపునేని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత నవీన్‌ ఎర్నేని, మోషన్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ బి.గోపాల్, సాంగ్‌ టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ విడుదల చేశారు. చిత్ర నిర్మాత రాజా దారపునేని మాట్లాడతూ– ‘‘అందరూ కొత్తవాళ్లతో చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘రథం’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకంగా చెప్పగలను.

సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నాం. చంద్రశేఖర్‌ మంచి హార్డ్‌వర్కర్‌. రూపాయికి పది రూపాయల అవుట్‌పుట్‌ ఇచ్చే వ్యక్తి. భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్‌ అవుతాడు’’ అన్నారు. ‘‘సినిమా విజయంపై మంచి అంచనాలతో ఉన్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు చిత్ర సమర్పకులు వినోద్‌. ‘‘సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న టీమ్‌తో పనిచేశాను. రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు గీత్‌ ఆనంద్‌. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ ముత్యాల, సంగీతం: సుకుమార్‌ పమ్మీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నివాశర్మ.

Advertisement
 
Advertisement
Advertisement