అత్తారింట్లో సరదాగా... | Rashmika attends her first Bhootha Kola with fiancé Rakshit | Sakshi
Sakshi News home page

అత్తారింట్లో సరదాగా...

Feb 11 2018 12:43 AM | Updated on Feb 11 2018 12:55 AM

Rashmika attends her first Bhootha Kola with fiancé Rakshit - Sakshi

రష్మికా మండన్న

రష్మికా మండన్నా.. లేటెస్ట్‌ తెలుగు సినిమా సెన్సేషన్‌. ‘ఛలో’ సినిమా సూపర్‌ హిట్‌  అయిన తర్వాత తెలుగు యూత్‌ అందరి నెక్ట్స్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌ అయిపోయారామె. కానీ ఆవిడ సింగిల్‌ కాదండోయ్‌. కన్నడంలో ‘కిరిక్‌ పార్టీ‘ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వగానే అందులో హీరో రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ చేసేసుకున్నారీ కన్నడ బ్యూటీ. ఎంగేజ్‌  అయిన తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. వీలున్నప్పుడల్లా రష్మికా, రక్షిత్‌ శెట్టి కలిసి టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారట. ఈ మధ్యన రక్షిత్‌ శెట్టి వాళ్ల ఫ్యామిలీ ట్రెడిషన్‌ అయిన ‘భూత కోల’ అనే ఆటను రష్మికా చూశారట. భూత కోల కూడా మన జాతరలలో అమ్మవారి ముందు చేసే నృత్యం లాంటిదే. 

తులు మాట్లాడే కన్నడ వాళ్ల సాంప్రదాయం ఈ ‘భూత కోల’. కన్నడంలో ‘భూత’ అంటే ‘స్పిరిట్‌’ అని ‘కోల’ అంటే ఆట అని అర్ధం.  ఈ ట్రిప్‌ గురించి మాట్లాడుతూ – ‘‘ఇది నా ఫస్ట్‌ ‘భూత కోల’ ఎక్స్‌పీరియన్స్‌. చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇంతకు ముందు రక్షిత్‌ ద్వారా దీని గురించి విన్నాను. ఈ ఆచారాలను ఇంకా ఎంతోమంది ఫాలో అవుతున్నారంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత కూడా ‘భూత కోల’ లాంటి మరో సంప్రదాయ నృత్యాన్ని చూశాం. ఈ ట్రిప్‌ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. వెంటనే మా పనుల మీద బెంగళూర్‌ వెళ్లిపోవాల్సి ఉంది. ఉన్న ఆ కొద్ది టైమ్‌లో రక్షిత్‌ శెట్టి వాళ్ల ఇంట్లో కొద్దిసేపు గడిపాము. వాళ్ల ఫ్యామిలీ, కిడ్స్‌ అందరితో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేశాను. నా ఫేవరెట్‌ ఫిష్‌ ఫ్రై కుడా సెర్వ్‌ చేశారు’’ అని కాబోయే అత్తారింటి విశేషాలను పేర్కొన్నారు రష్మికా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement