వినోదమే ప్రధానంగా ... | Rashmi Gautam First Look in Thanu Vacchenanta | Sakshi
Sakshi News home page

వినోదమే ప్రధానంగా ...

Mar 13 2016 10:49 PM | Updated on Sep 3 2017 7:40 PM

వినోదమే ప్రధానంగా ...

వినోదమే ప్రధానంగా ...

వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో...

వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రచయిత, దర్శకుడు బీవీయస్ రవి విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ కథలతో పాటు, హారర్, కామెడీ సినిమాల హవా ప్రస్తుతం కొనసాగుతోంది. సెంటిమెంట్ ఉండే కథలను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. వినోద ప్రధానంగా సాగుతుంది. మిగిలిన మూడు పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బెక్కం రవీందర్, కెమేరా: రాజ్‌కుమార్, సంగీతం: రవిచంద్ర, సహ నిర్మాతలు: లావు శ్రీమన్నారాయణ, పి.యశ్వంత్.

Advertisement
 
Advertisement
Advertisement