లైవ్‌ చాట్‌లో రణ్‌వీర్‌ ఫన్నీ కామెంట్‌!

Ranveer Singh Funny Comment On Boman Irani Instagram Live Chat  - Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పెట్టిన ఫన్నీ కామెంటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నటులు బొమన్ ఇరానీ, జానీలు మానవత్వంపై ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం రాత్రి లైవ్‌ చాట్‌ను నిర్వహించారు. కాగా లైవ్‌ చాట్‌ కొనసాగుతుండగా రణ్‌వీర్‌ మధ్యలో ‘నేను నా భర్యకు సాయం చేస్తున్నాను జానీ సార్‌!!!’ అంటూ కామెంటు చేశాడు. అయితే లైవ్‌లో జరుగుతున్న సంభాషణకు పొంతన లేకుండా రణ్‌వీర్‌ కామెంట్‌ పెట్టి నవ్వులు పూయించాడు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు)

ఇక ఈ కామెంటుకు సంబంధించిన ఫొటోను దీప్‌వీర్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న రణ్‌వీర్‌ తన భార్య దీపికా పదుకొనెతో ఇంటి పనుల్లో బిజీగా ఉన్నట్లు తన కామెంట్‌ ద్వారా చెప్పకనే చెప్పాడు. కాగా ప్రస్తుతం రణ్‌వీర్‌ హీరోగా రాబోయే స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘83’ లో బొమన్‌ ఇరానీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నాడు. (లాక్‌డౌన్‌: ‘ప్రజలకు వైద్యంతోపాటు అవి కూడా ముఖ్యం’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top