సల్మాన్‌.. షారూఖ్‌లు వియ్యంకులైతే..!

Rani Mukerji Wants Salman Khan Daughter To Marry Sharukh Son AbRam - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లు ఇటీవల పాత పగలను పక్కన పెట్టి కలిసి మెలిసి కనిపిస్తున్నారు. ఒకరి సినిమాలో ఒకరు అతిథి పాత్రలు చేస్తూ సాయం చేసుకుంటున్నారు. తాజా ఈ ఇద్దరి గురించి నటి రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. షారూఖ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దస్‌ కా ధమ్‌ కార్యక్రమ గ్రాండ్‌ ఫినేలుకు సల్మాన్‌ రాణీ ముఖర్జీలు గెస్ట్‌లుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ సల్మాన్‌ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్‌ని ఉద్దేశించి ‘నువ్వు పెళ్లి చేసుకోకపోయినా.. కూతుర్ని మాత్రం కను. షారూఖ్‌ కొడుకు అబ్‌రామ్‌కు సల్మాన్‌ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే చూడాలిని ఉంది’ అన్నారు. అంతేకాదు ‘నేను సల్మాన్‌ షారూఖ్‌లు ఇద్దరితో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేశాను. వీరిలో షారూఖ్‌ ప్రేమగా స్వీట్‌గా ఉంటే.. సల్మాన్‌ప్రేమ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంద’న్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top