హనీమూన్ కాటేజ్‌లో..! | Ranbir, Katrina share 'Honeymoon Cottage' | Sakshi
Sakshi News home page

హనీమూన్ కాటేజ్‌లో..!

Jun 28 2014 1:07 AM | Updated on Sep 2 2017 9:27 AM

హనీమూన్ కాటేజ్‌లో..!

హనీమూన్ కాటేజ్‌లో..!

సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుంది. అద్దాల మేడలు, పడవలాంటి కార్లు, అడుగులకు మడుగులొత్తే సేవకులు..

సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుంది. అద్దాల మేడలు, పడవలాంటి కార్లు, అడుగులకు మడుగులొత్తే సేవకులు.. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేలా ఉంటుంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టుగా.. ఈ స్వర్గం ఒకవైపు మాత్రమే ఉంటుంది. మరోవైపు వీళ్లకి అస్సలు స్వేచ్ఛ ఉండదు. గుట్టుచప్పుడు కాకుండా చేయాలనుకునే విషయాలు కూడా గుప్పుమని నలుగురికీ తెలిసిపోతాయ్. కెరీర్‌పరంగా అపజయాలు. ఇలా ఒక్కోసారి ప్రత్యక్ష నరకం చవిచూస్తారు.

ఆ మధ్య రణబీర్‌కపూర్, కత్రినా కైఫ్ విషయంలో ఇదే జరిగింది. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక్కడుంటే పబ్లిక్‌గా తిరగడానికి కుదరదు కాబట్టి, విదేశాలకు వెళ్లారు. అక్కడ ఓ బీచ్‌లో పొట్టి నిక్కరులో రణబీర్, బికినీలో కత్రినా ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఎవరో సెల్‌ఫోన్‌లో బంధించి, ఆ ఇద్దరూ ఇక్కడికొచ్చేసరికి రచ్చ రచ్చ చేసేశారు. గుట్టురట్టయిందని ఇద్దరూ తెగ బాధపడిపోయారు. అప్పుడైతే ఈ ఇద్దరూ అలా చేశారు కాబట్టి, వార్తల్లో నిలిచారు. కానీ, ఇప్పుడేం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ జంట ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ఆ చిత్రం షూటింగ్ ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగింది. అక్కడ రణబీర్, కత్రినాకు ఓ కాటేజ్‌లో బస ఏర్పాటు చేశారు. దాన్ని ‘హనీమూన్ కాటేజ్’ అంటారట. ఆ కాటేజ్‌లో ఈ ఇద్దరూ విడివిడి గదుల్లోనే ఉన్నప్పటికీ, ‘హనీమూన్ కాటేజ్’లో ఉన్నారని ప్రచారమైంది. చివరికి చిత్రబృందం కూడా ఈ విషయంపై జోకులేశారట. రణబీర్, కత్రినా కూడా సరదాగా నవ్వుకున్నారని సమాచారం. ఓవైపు ఈ జోకులను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు ఈ ఇద్దరూ షూటింగ్‌కి విరామం దొరికినప్పుడల్లా తెగ షాపింగ్ చేశారట. ముంబయ్‌లో ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండనున్నారట. ఆ కొత్త ఇంటి కోసమే ఈ షాపింగ్ అనే ఊహాగానాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement