మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో! | Ranbir Kapoor Replaces Mahesh Babu in Sandeep Reddy Vanga Movie | Sakshi
Sakshi News home page

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

Sep 17 2019 10:12 AM | Updated on Sep 17 2019 11:05 AM

Ranbir Kapoor Replaces Mahesh Babu in Sandeep Reddy Vanga Movie - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన సందీప్‌కు తరువాత ఆఫర్లు క్యూ కట్టాయి. సూపర్‌ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కింది. అయితే ఈ లోగా బాలీవుడ్ లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చేసే అవకాశం రావటంతో సౌత్‌ ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి బాలీవుడ్‌ చేరాడు.

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ బాలీవుడ్‌ లో కూడా రికార్డ్‌లు సృష్టించటంతో ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌ మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే ముందుగా మహేష్ బాబుతో అనుకున్న కథను కూడా ఇప్పుడు హిందీలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో మహేష్‌కు చెప్పిన కథను ఇప్పుడు బాలీవుడ్ హీరోతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

ఇప్పటికే బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో రణబీర్‌ కపూర్‌కు కథ కూడా వినిపించినట్టుగా ప్రచారం జరుగుతుంది. రణబీర్‌ కూడా లైన్‌తో పాటు సందీప్‌ టేకింగ్‌ స్టైల్‌ మీద నమ్మకంతో వెంటనే ఓకే చేశాడట. ఈ సినిమాకు డెవిల్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న రణబీర్‌ ఆ సినిమా పూర్తయిన తరువాత సందీప్‌ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement