18 నెలల జైల్లోనే.. బెయిల్‌ కూడా దొరకలేదు! | Ranbir Kapoor Recreates 1993 Arrest Of Sanjay Dutt | Sakshi
Sakshi News home page

May 12 2018 4:44 PM | Updated on May 12 2018 8:15 PM

Ranbir Kapoor Recreates 1993 Arrest Of Sanjay Dutt - Sakshi

న్యూఢిల్లీ : ‘‘ సంజూ మొదటిసారి 1993లో అరెస్ట్‌ అయ్యాడు. 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. కనీసం బెయిల్‌ కూడా దొరకలేదు. ఆ సమయంలో సంజూ పరిస్థితికి అద్దం పట్టే పోస్టర్‌ ఇది ’’ అంటూ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ ‘సంజూ’ సినిమా లేటెస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో రణ్‌బీర్‌ చేతులకు బేడీలతో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ సినిమాలో సంజయ్‌దత్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజు పాత్రలో రణ్‌బీర్‌ చేతులకు బేడీలు వేసుకున్న, 2013లో ఎరవాడ జైలులో ఉన్నప్పటి పోస్టర్‌లను ఆయన విడుదల చేశారు. ఇప్పటికే సినిమా పూర్తి కావస్తుండటంతో ప్రమోషన్లపై దృష్టి సారించింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగా సంజయ్‌ దత్‌ జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలకు సంబంధించిన సినిమా దృశ్యాల పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement