పంజాబీ రీమేక్లో రానా..? | Rana eyeing a Punjabi remake | Sakshi
Sakshi News home page

పంజాబీ రీమేక్లో రానా..?

Jun 3 2016 2:07 PM | Updated on Aug 11 2019 12:52 PM

పంజాబీ రీమేక్లో రానా..? - Sakshi

పంజాబీ రీమేక్లో రానా..?

ప్రస్తుతం బాహుబలి, ఘాజీ లాంటి భారీ ప్రాజెక్ట్లలో నటిస్తున్న రానా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా..

ప్రస్తుతం బాహుబలి, ఘాజీ లాంటి భారీ ప్రాజెక్ట్లలో నటిస్తున్న రానా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.., అది విలన్ రోల్ కావటంతో ఇప్పుడు తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే పనిలో పడ్డాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా ఘాజీని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రూపొందిస్తున్నాడు.

ఇక నటుడిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే పంజాబీలో తెరకెక్కుతున్న సర్థార్ జీ 2 రీమేక్ రైట్స్ను తానే స్వయంగా తీసుకున్నాడు.  ఈ సినిమాలో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఇలాంటి సినిమాలో నటిస్తే నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయని ఫీల్ అవుతున్నాడు రానా. అందుకే ఈ సినిమాలో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement