రానా... మళ్లీ గడ్డం పెంచాలి నాన్నా! | Rana Daggubati's family throws a party for Samantha Ruth Prabhu | Sakshi
Sakshi News home page

రానా... మళ్లీ గడ్డం పెంచాలి నాన్నా!

Nov 2 2017 1:17 AM | Updated on Aug 11 2019 12:52 PM

Rana Daggubati's family throws a party for Samantha Ruth Prabhu - Sakshi

ఎవరీ కుర్రాడు? రానాను చూడగానే మ్యాగ్జిమమ్‌ మనుషులకు డౌటొచ్చింది. చెన్నైలో నాగచైతన్య–సమంత రిసెప్షన్‌లో! డైరెక్టుగా ‘నువ్వెవరు?’ అనడిగినోళ్లూ ఉన్నారు. ‘నేనండీ... మీ రానాను’ అని చెప్పుకున్నారట! ఎప్పుడూ గడ్డంతో కనిపించే కుర్రాడు సడన్‌గా క్లీన్‌ షేవ్‌ లుక్కులో కనిపించేసరికి కన్‌ఫ్యూజ్‌ అవ్వరా మరి? ఇంతకీ, రానా గడ్డం ఎందుకు తీశారు? తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘1945’ కోసం! అందులో కొన్ని సన్నివేశాలను క్లీన్‌ షేవ్‌ లుక్కులో షూట్‌ చేశారు. అయితే... సిన్మా అంతా సేమ్‌ లుక్‌ ఉండదు.

కొన్ని సీన్లలో క్లీన్‌ షేవ్‌తోనూ, మరికొన్ని సీన్లలో గడ్డంతోనూ కనిపించనున్నారు. క్లీన్‌ షేవ్‌ సీన్లు అన్నిటినీ రానా కంప్లీట్‌ చేసేశారని సమాచారమ్‌. ఆల్రెడీ గడ్డంతో కొన్ని సీన్లు తీశారు. మరికొన్నిటికి రానా మళ్లీ గడ్డం పెంచుతున్నారు. సో, త్వరలోనే రానా ట్రేడ్‌ మార్క్‌ లుక్‌ (గడ్డంతో)ను ప్రేక్షకులు మళ్లీ చూడొచ్చన్న మాట. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... రానా గడ్డం మెయిన్‌టైన్‌ చేసినా బాగుంటారు. క్లీన్‌ షేవ్‌లోనూ హ్యాండ్సమ్‌గా ఉన్నారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. సత్యశివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1945’లో రెజీనా హీరోయిన్‌గా, నాజర్, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement