అదో బోరింగ్‌ టాపిక్‌

Rana Daggubati shuts down reports of kidney transplant rumours - Sakshi

‘రానాకు అమెరికాలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. రానా తల్లి లక్ష్మీ దగ్గుబాటి స్వయంగా కిడ్నీ దానం చేశారు’ అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రానా ఆరోగ్యం విషయంలో పదే పదే ఏదో వార్త షికారు చేయడం చాలా కామన్‌గా అయిపోయింది. ఇటీవల రానా అమెరికాకు వెళ్లడంతో కిడ్నీ మార్పిడి సర్జరీ కోసమే అక్కడకు వెళ్లాడని ఆన్‌లైన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి చాలా రోజుల నుంచి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

నా ఆరోగ్యంపై రూమర్లు వచ్చిన ప్రతిసారీ ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అని క్లారిటీ ఇచ్చి అలిసిపోయాను. అందుకే నాకు ఇదో బోరింగ్‌ టాపిక్‌ అయింది. హైదరాబాద్‌ వదిలి నేను ఎక్కడికైనా ప్రయాణమైతే చాలు.. చాలామంది టెన్షన్‌ పడిపోతున్నారు. నా మీద అందరూ చూపించే శ్రద్ధకు.. ప్రేమకు ఋణపడి ఉంటాను. గుణశేఖర్‌ దర్శకత్వంలో నేను నటించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘హిరణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం ఇటీవల అమెరికా వెళ్లాను. ప్రీ విజువలైజేషన్‌ కాన్సెప్ట్‌ గురించి పలు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలతో మాట్లాడేందుకే వెళ్లా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top