20 లక్షలకు చేరిన రానా ఫాలోవర్స్ | Rana Daggubati Got 2 Million Twitter Followers After Mahesh Babu | Sakshi
Sakshi News home page

20 లక్షలకు చేరిన రానా ఫాలోవర్స్

Sep 21 2016 12:40 PM | Updated on Sep 4 2017 2:24 PM

20 లక్షలకు చేరిన రానా ఫాలోవర్స్

20 లక్షలకు చేరిన రానా ఫాలోవర్స్

హీరోగా, విలన్గా అలరిస్తున్నటాలీవుడ్ యంగ్ హీరో రానా మరో రికార్డ్ సాధించాడు.

హీరోగా, విలన్గా అలరిస్తున్నటాలీవుడ్ యంగ్ హీరో రానా మరో రికార్డ్ సాధించాడు. సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ టాల్ హీరో ట్విట్టర్లో ఏకంగా 20 లక్షలకు పైగా ఫాలోవర్స్తో సత్తా చాటాడు. దాదాపు యంగ్ జనరేషన్ టాలీవుడ్ హీరోలందరూ పదిలక్షల మంది ఫాలోవర్స్కు కాస్త అటు ఇటుగా కొనసాగుతుండగా రానా మాత్రం 20 లక్షల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. తనకు ఈ అరుదైన రికార్డ్ ను అందించిన అభిమానులకు రానా కృతజ్ఞతలు తెలియజేశాడు.

24 లక్షల మంది ఫాలోవర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే రానా కన్నా ముందున్నాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 షూటింగ్లో పాల్గొంటున్న రానా, ఆ సినిమాతో పాటు సబ్మెరైన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే పొలిటికల్ థ్రిల్లర్కు ఓకె చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement