జోగేంద్రగా రానా..! | Rana as jogendra in nene raju nene matri | Sakshi
Sakshi News home page

జోగేంద్రగా రానా..!

May 28 2017 10:37 AM | Updated on Aug 11 2019 12:52 PM

జోగేంద్రగా రానా..! - Sakshi

జోగేంద్రగా రానా..!

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో అలరించనున్నాడు. బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో డిఫరెంట్ సినిమాల హీరోగా పేరుతెచ్చుకున్న భల్లాలదేవ, నెక్ట్స్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. రానా పొలిటీషన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు జోగేంద్ర అని తెలిపారు.  ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్న తేజ, తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement