టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు | ramgopal varma tweets on tollywood heroes | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు

Mar 16 2017 8:13 PM | Updated on Aug 25 2018 6:31 PM

టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు - Sakshi

టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు

టాలీవుడ్ నుంచి ముంబై వెళ్లిపోయి.. అక్కడే సినిమాలు తీసుకుంటూ, అక్కడే తన ఆఫీసు కూడా పెట్టేసుకున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ... బాహుబలి పేరుతో మరోసారి టాలీవుడ్ మీద విరుచుకుపడ్డాడు.

టాలీవుడ్ నుంచి ముంబై వెళ్లిపోయి.. అక్కడే సినిమాలు తీసుకుంటూ, అక్కడే తన ఆఫీసు కూడా పెట్టేసుకున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ... బాహుబలి పేరుతో మరోసారి టాలీవుడ్ మీద విరుచుకుపడ్డాడు. ఇందుకోసం ఎప్పటిలాగే తన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నాడు. బాహుబలి 2 ట్రైలర్‌కు ప్రపంచం అంతా జై కొడుతున్నా, టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్‌గా ఉందని, అందుకు కారణం కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని అన్నాడు.

టాలీవుడ్ పవర్‌ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నించి, ఘోరంగా విఫలమై ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో మిగిలిపోయారని, ప్రభాస్ మాత్రం రెండు దెబ్బలతో అంతర్జాతీయ స్టార్ అయిపోయాడని వర్మ చెప్పాడు. బాహుబలి 2 తర్వాత టాలీవుడ్‌లో పవర్‌ఫుల్లెస్ట్ మెగా సూపర్‌స్టార్లందరికీ కూడా ప్రభాస్ కాలిగోటిని అందుకోడానికి రెండున్నర జన్మలు పడుతుందని వ్యాఖ్యానించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement