breaking news
Baahubali 2 trailer
-
టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు
టాలీవుడ్ నుంచి ముంబై వెళ్లిపోయి.. అక్కడే సినిమాలు తీసుకుంటూ, అక్కడే తన ఆఫీసు కూడా పెట్టేసుకున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ... బాహుబలి పేరుతో మరోసారి టాలీవుడ్ మీద విరుచుకుపడ్డాడు. ఇందుకోసం ఎప్పటిలాగే తన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నాడు. బాహుబలి 2 ట్రైలర్‌కు ప్రపంచం అంతా జై కొడుతున్నా, టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్‌గా ఉందని, అందుకు కారణం కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని అన్నాడు. టాలీవుడ్ పవర్ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నించి, ఘోరంగా విఫలమై ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో మిగిలిపోయారని, ప్రభాస్ మాత్రం రెండు దెబ్బలతో అంతర్జాతీయ స్టార్ అయిపోయాడని వర్మ చెప్పాడు. బాహుబలి 2 తర్వాత టాలీవుడ్లో పవర్‌ఫుల్లెస్ట్ మెగా సూపర్‌స్టార్లందరికీ కూడా ప్రభాస్ కాలిగోటిని అందుకోడానికి రెండున్నర జన్మలు పడుతుందని వ్యాఖ్యానించాడు. BB2 trailerni Prapanchamantha jai kodutunna tollywood matram super silentgaa vundataaniki kaaranam Kullu samudramlo munigipovadam moolana — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 Tollywood powerful starlu national ga try chesi ghoramga fail ayyi regional ayipoyaru .Prabhas rendu debbalatho international star ayipoyadu — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 BB2 tharvatha tollywoodlo powerfulest mega superstarlandariki kooda Prabhas kaali gotinandukovataaniki rendunnara janmalu paduthundhi — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 -
రాజమౌళికి సెల్యూట్ : రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద ట్వీట్లు మాత్రమే చేసే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తనకు నచ్చిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు. ఒక్కోసారి వర్మ చేసే ట్వీట్లు చేస్తే నిజంగానే పొగుడుతున్నాడా..? లేక వెటకారం చేస్తున్నాడ అన్న అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఈ సారి మాత్రం కాస్త జెన్యూన్ గానే స్పందించినట్టున్నాడు వర్మ. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వర్మ స్పందించాడు. 'ఇది అమ్మలాంటి సినిమా ట్రైలర్ కాదు.. అమ్మమ్మ లాంటి సినిమా ట్రైలర్. మెగా బాహుబలియన్ రాజమౌళికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో కూడా వర్మ, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా వర్మ స్పంధించిన తీరు తెలుగు సినిమా అభిమానుల్లో జోష్ పెంచింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి ఆడియో మార్చి 25న, సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. Trailer of not the Mother of Movies,but the Fucking Grandmother of Movies..A MegaBahubalian Salute to @ssrajamouli https://t.co/OoFY4lm3R1 — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017