రాజమౌళికి సెల్యూట్ : రామ్ గోపాల్ వర్మ | Ram gopal Varma Comments on Baahubali 2 trailer | Sakshi
Sakshi News home page

రాజమౌళికి సెల్యూట్ : రామ్ గోపాల్ వర్మ

Mar 16 2017 10:11 AM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళికి సెల్యూట్ : రామ్ గోపాల్ వర్మ - Sakshi

రాజమౌళికి సెల్యూట్ : రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద ట్వీట్లు మాత్రమే చేసే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తనకు నచ్చిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు.

వివాదాస్పద ట్వీట్లు మాత్రమే చేసే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తనకు నచ్చిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు. ఒక్కోసారి వర్మ చేసే ట్వీట్లు చేస్తే నిజంగానే పొగుడుతున్నాడా..? లేక వెటకారం చేస్తున్నాడ అన్న అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఈ సారి మాత్రం కాస్త జెన్యూన్ గానే స్పందించినట్టున్నాడు వర్మ. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వర్మ స్పందించాడు.

'ఇది అమ్మలాంటి సినిమా ట్రైలర్ కాదు.. అమ్మమ్మ లాంటి సినిమా ట్రైలర్. మెగా బాహుబలియన్ రాజమౌళికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో కూడా వర్మ, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా వర్మ స్పంధించిన తీరు తెలుగు సినిమా అభిమానుల్లో జోష్ పెంచింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి ఆడియో మార్చి 25న, సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement