ఛాలెంజ్ పూర్తిచేసిన చెర్రీ.. తర్వాత వారే | Ramcharan Accepts Be The Realman Challenge Further Nominates | Sakshi
Sakshi News home page

ఛాలెంజ్ పూర్తిచేసిన రామ్‌చ‌ర‌ణ్‌..

Apr 21 2020 3:30 PM | Updated on Apr 21 2020 4:32 PM

Ramcharan Accepts Be The Realman Challenge Further Nominates - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు శుభ్రపరచడం, చెట్లకు నీళ్లు పోయడం వంటి పనులను చేసిన చెర్రీ.. చివరగా రెండు క‌ప్స్‌లో కాఫీని కలిపి తన సతీమణి ఉపాసనకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు రామ్‌చ‌ర‌ణ్. ఇంటి ప‌నులు చేయ‌డంలో మ‌హిళ‌ల‌కు స‌హాయం చేద్దాం అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మెగాభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా త‌న ఛాలెంజ్‌ను స్వీక‌రించాలంటూ దర్శకుడు త్రివిక్రమ్‌, రానా, శర్వానంద్‌, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ లకు స‌వాల్ విసిరారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా మొద‌లుపెట్టిన ఈ ఛాలెంజ్‌.. సోష‌ల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువ‌రు సినీ ప్ర‌ముఖ‌లు ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి ఇంటి ప‌నులు చేస్తున్న వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement