రిస్క్ వద్దనుకుంటున్న రామ్ | Ram Next Movie with Kirshore Tirumala | Sakshi
Sakshi News home page

రిస్క్ వద్దనుకుంటున్న రామ్

Jan 29 2017 12:59 PM | Updated on Sep 5 2017 2:25 AM

రిస్క్ వద్దనుకుంటున్న రామ్

రిస్క్ వద్దనుకుంటున్న రామ్

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్లు అందుకున్న యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా రిస్క్

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్లు అందుకున్న యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా రిస్క్ చేయకూడదనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే అనీల్ రావిపూడి చెప్పిన గుడ్డివాడి పాత్రకు నో చెప్పిన రామ్.., లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అది కూడా సక్సెస్ ట్రాక్లో ఉన్న టీంతోనే కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడు.

అందుకే గతంలో ఎనౌన్స్ చేసిన కరుణాకరణ్ సినిమాను కూడా కాదని ముందుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. నేను శైలజ సినిమాతో రామ్ కెరీర్ను మలుపు తిప్పిన కిశోర్ తిరుమల, ఆ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయాల్సి ఉంది.. అయితే ఈ సినిమా ఆలస్యమవుతుండటంతో ఈ గ్యాప్లో రామ్తో సినిమాను పూర్తి చేసే ప్లాన్లో ఉన్నాడు కిశోర్.

Advertisement
 
Advertisement
Advertisement