రిస్క్ చేస్తున్న రామ్ | ram next movie with karunakaran | Sakshi
Sakshi News home page

రిస్క్ చేస్తున్న రామ్

May 28 2016 8:49 AM | Updated on Sep 4 2017 1:08 AM

రిస్క్ చేస్తున్న రామ్

రిస్క్ చేస్తున్న రామ్

చాలా కాలం తరువాత ఇటీవల నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు...

చాలా కాలం తర్వాత ఇటీవల 'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినా.. నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. అయితే కందిరీగ తరువాత రభస లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చిన సంతోష్తో రామ్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది.

సంతోష్ శ్రీనివాస్ సినిమా తరువాత కూడా మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. గతంలో రామ్ హీరోగా 'ఎందుకంటే ప్రేమంట' లాంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. లవ్ స్టోరీస్ తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరున్న కరుణాకరన్ రామ్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. మరి రామ్ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement