కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా | ram next movie with kandhiriga fame santhosh srinivas | Sakshi
Sakshi News home page

కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా

Nov 24 2015 8:17 AM | Updated on Sep 3 2017 12:57 PM

కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా

కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా

శివమ్ సినిమా రిజల్ట్తో డీలా పడ్డ రామ్, వెంటనే తేరుకొని స్పీడు పెంచుతున్నాడు. ప్రస్థుతం కిశోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న...

శివమ్ సినిమా రిజల్ట్తో డీలా పడ్డ రామ్, వెంటనే తేరుకొని స్పీడు పెంచుతున్నాడు. ప్రస్థుతం కిశోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు. గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్లోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్.

దేవదాస్, రెడీ లాంటి హిట్స్ తరువాత కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో రామ్ను ఆదుకున్న సినిమా కందిరీగ. సంతోష్ శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి, రామ్ కెరీర్ను గాడిలో పెట్టింది. కందిరీగ తరువాత ఎన్టీఆర్ హీరోగా రభస సినిమా చేశాడు సంతోష్. అయితే ఆ సినిమా తఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

శివమ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన రామ్ మరోసారి సక్సెస్ కోసం సంతోష్ శ్రీనివాస్నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం కిశోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే కందిరీగ కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కష్టాల్లో ఉన్న రామ్, సంతోష్ శ్రీనివాస్ల కెరీర్లను ఈ రిపీట్ కాంబినేషన్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement