'హరికథ' కాదు 'నేను శైలజ' | Ram Next movie title nenu sailaja | Sakshi
Sakshi News home page

'హరికథ' కాదు 'నేను శైలజ'

Nov 12 2015 11:23 AM | Updated on Sep 3 2017 12:23 PM

'హరికథ' కాదు 'నేను శైలజ'

'హరికథ' కాదు 'నేను శైలజ'

యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. వరుసగా రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో...

యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన 'శివమ్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. రొటీన్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ను మెప్పించలేకపోయింది.

దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సెకండ్ హ్యాండ్' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాకు 'హరికథ' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. అయితే రామ్ ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. హరికథ అనే టైటిల్ పాతగా అనిపిస్తోందన్న ఉద్దేశంతో 'నేను శైలజ' అనే సాఫ్ట్ టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

ప్రస్తుతం యంగ్ హీరోలందరూ 'నాన్నకు ప్రేమతో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది' లాంటి సాఫ్ట్ టైటిల్స్తో వస్తుంటే తను మాత్రం ప్రయోగం చేయటం ఎందుకు అని భావించిన రామ్, 'నేను శైలజ' టైటిల్కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే చిత్రయూనిట్ ఈ టైటిల్ను అఫీషియల్గా ఎనౌన్స్ చేయనున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement