తెలుగులో ఐస్ క్రీమ్, తమిళ్లో చాకోబార్ | Ram gopal varmas experimental movie to release in tamil | Sakshi
Sakshi News home page

తెలుగులో ఐస్ క్రీమ్, తమిళ్లో చాకోబార్

Aug 17 2016 2:45 PM | Updated on Sep 4 2017 9:41 AM

తెలుగులో ఐస్ క్రీమ్, తమిళ్లో చాకోబార్

తెలుగులో ఐస్ క్రీమ్, తమిళ్లో చాకోబార్

హిట్ ఫ్లాప్ అన్నతేడా లేకుండా కొద్ది రోజులు పాటు తెలుగు తెర మీద వరుసగా తన సినిమాలతో దాడి చేశాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొత్త టెక్నాలజీ పేరుతో కథ లేకపోయినా తన క్రియేటివిటీతో బండి...

హిట్ ఫ్లాప్ అన్నతేడా లేకుండా కొద్ది రోజులు పాటు తెలుగు తెర మీద వరుసగా తన సినిమాలతో దాడి చేశాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొత్త టెక్నాలజీ పేరుతో కథ లేకపోయినా తన క్రియేటివిటీతో బండి లాగించెయ్యోచ్చన్న నమ్మకంతో వరుసగా సినిమాలు చేశాడు, అయితే ఈ లిస్ట్ లో చాలా వరకు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ప్రస్తుతం తన మకాం ముంబైకి మార్చేసిన వర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే గతంలో వర్మ తెలుగుతో తీసిన ఓ ఫ్లాప్ సినిమాను ఇప్పుడు తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. నవదీప్, తేజస్వీ జంటగా తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాను కోలీవుడ్ లో చాకోబార్ పేరుతో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఈసినిమా వర్మ పరిచయం చేసిన ఫ్లో కామ్, ఫ్లో సౌడ్ లాంటి టెక్నాలజీలు  తమిళ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారట. మరి తెలుగు ఐస్ క్రీమ్, తమిళ చాకోబార్ లా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement