RGV and Nagarjuna 'Officer' Movie Censor Report- Sakshi
Sakshi News home page

May 29 2018 3:29 PM | Updated on Jul 15 2019 9:21 PM

Ram Gopal Varma Officer Censor Completed - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆఫీసర్‌. చాలా కాలం తరువాత కింగ్‌ నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమా కావటంతో ఆఫీసర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా వర్మ కూడా జాగ్రత్త సినిమా చేశానని చెపుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌  ప్రీ రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కర్ణాటకు చెందిన ఐపీఎస్‌ అధికారి కేఎం ప్రసన్న జీవితం ఆధారంగా హీరో పాత్రను తీర్చి దిద్దిన ఈ సినిమాలో నాగార్జున పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా మైరా సరీన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement