దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ | Ram Gopal Varma Meets Disha Accused Chennakesavulu Wife | Sakshi
Sakshi News home page

దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ

Feb 2 2020 1:49 PM | Updated on Feb 2 2020 2:50 PM

Ram Gopal Varma Meets Disha Accused Chennakesavulu Wife - Sakshi

సాక్షి, హైదరాబాద్: నిర్భయ సంఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశా అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దిశపై అత్యాచారం, అనంతరం హతమార్చిన వాళ్లను ఉరి తీయాలంటూ జనాలు రోడ్డెక్కెలా చేసిందా ఘటన. ఈ కేసులో  నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ  సినిమా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. (నా తదుపరి చిత్రం ‘దిశ’: వర్మ)

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం కలిశారు. దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు.. అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని వర్మ మండిపడ్డారు. ‘రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది, 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయింది’ అంటూ  వర్మ ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement