‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించిన గమనిక’ | Ram Gopal Varma Clarity On Lakshmis Ntr Pre Release Business | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించిన గమనిక’

Feb 28 2019 10:25 AM | Updated on Feb 28 2019 10:25 AM

Ram Gopal Varma Clarity On Lakshmis Ntr Pre Release Business - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్‌.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంచి లాభాలకు వర్మ సినిమాలను అమ్మేసినట్టుగా టాలీవుడ్‌ లో సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన వర్మ సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్  డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి  కొనుక్కున్నారు  అని వస్తున్న రక రకాల వార్తల్లో  నిజాలు లేవు ...ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు  Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement