‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తెలుగు రంగస్థల నటుడు..! | Ram Gopal Varma About Ntr In Lakshmis NTR | Sakshi
Sakshi News home page

Jan 19 2019 3:46 PM | Updated on Jan 19 2019 5:14 PM

Ram Gopal Varma About Ntr In Lakshmis NTR - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వర్మ కూడా తనదైన స్టైల్‌లో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచాడు. ఇప్పటికే రెండు లిరికల్‌ వీడియోలను రిలీజ్‌ చేసి తన ఉద్దేశం ఏంటో..? సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు.

తాజాగా వర్మ.. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో ఎన్టీఆర్‌ పాత్రధారిని పరిచయం చేశాడు. ఇప్పటికే చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రల్లో కనిపించబోయే నటుల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పాత్రలో కనిపించబోయే నటుడి టీజర్‌ను రిలీజ్ చేశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌ గా కనిపిస్తున్న నటుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారుడని వెళ్లడించాడు వర్మ. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌, ప్రవర్తన, డైలాగ్ డెలవరీ కోసం కొన్ని నెలలుగా అతడికి శిక్ష ఇస్తున్నామని తెలిపాడు.


Advertisement
 
Advertisement
Advertisement