చెర్రీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..? | Ram Charan wants to Break Dasara Sentiment | Sakshi
Sakshi News home page

చెర్రీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

Aug 26 2016 10:31 AM | Updated on Jul 29 2019 6:03 PM

చెర్రీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..? - Sakshi

చెర్రీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

బ్రూస్లీ లాంటి డిజాస్టర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై...

బ్రూస్లీ లాంటి డిజాస్టర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇంత భారీగా తెరకెక్కుతున్న ధృవను ఓ సెంటిమెంట్ భయపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రెండు సార్లు దసరా బరిలో దిగిన చెర్రీ ఒక్క సారి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించలేదు. దసరా కానుకగా వచ్చిన గోవిందుడు అందరివాడేలేతో పర్వాలేదనిపించిన చెర్రీ, 2015లో బ్రూస్లీ సినిమాతో నిరాశపరిచాడు. దీంతో ధృవ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన చెర్రీ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement