
విజయ్, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది ‘అర్జున్ రెడ్డి’. ఆ పాత్రల్లోంచి విజయ్ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అంతా అనుకున్నారు. కానీ గీత గోవిందం సినిమాలోని తన నటనలో వైవిధ్యాన్ని చూపాడు. ఎక్కడా అర్జున్ రెడ్డి చాయలను కనిపించకుండా నటించేసి.. అందరిని మెప్పును పొందుతున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ నటనకు రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ స్పందించాడు.‘ అర్జున్ రెడ్డి తరువాత విజయ్ పర్‌ఫెక్ట్‌గా మారిపోయాడు. విజయ్, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. కథా, కథనాలు బాగున్నాయి. పరుశురామ్‌కు కంగ్రాట్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.