సెప్టెంబర్ 6న ‘తుఫాన్’ వస్తుందా? | Ram charan 'toofan' will be relased on september 6th? | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 6న ‘తుఫాన్’ వస్తుందా?

Aug 23 2013 12:32 AM | Updated on Sep 1 2017 10:01 PM

సెప్టెంబర్ 6న ‘తుఫాన్’ వస్తుందా?

సెప్టెంబర్ 6న ‘తుఫాన్’ వస్తుందా?

మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా, తెలుగు సినిమా వాతావరణం మాత్రం విపరీతంగా వేడెక్కింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఈ పరిణామం హాయిగానే ఉంది. పెద్ద సినిమాలకే సమస్య అంతానూ.

మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా, తెలుగు సినిమా వాతావరణం మాత్రం విపరీతంగా వేడెక్కింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఈ పరిణామం హాయిగానే ఉంది. పెద్ద సినిమాలకే సమస్య అంతానూ. నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. ముఖ్యంగా ‘మెగా’ సినిమాల విషయంలోనే ఈ సందిగ్ధావస్థ. అందుకే ఈ నెల 9న రావాల్సిన ‘అత్తారింటికి దారేది’ విడుదలను వాయిదా వేసేశారు. 
 
ఎప్పుడు రిలీజవుతుందనేది ఇప్పటివరకూ అధికారిక సమాచారం లేదు. అలాగే రామ్‌చరణ్ ‘ఎవడు’ని జూలై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. తర్వాత సెప్టెంబరుకి వాయిదా వేశారు. ఆ రెండు సినిమాల వరకూ ఓకే. అసలు చిక్కు ‘తుఫాన్’ దగ్గరే వచ్చింది. హిందీలో రామ్‌చరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భారీ ఎత్తున ‘జంజీర్’ నిర్మించింది. 
 
దీన్నే తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేస్తున్నారు. వాళ్లు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుదల చేయాలని మూడు నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసేశారు. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ డీలింగ్స్ పూర్తి చేశారు. పబ్లిసిటీని కూడా పక్కాగా ప్లాన్ చేసేశారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ చిత్రం ఆంధ్రా, సీడెడ్‌ల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుందా అనే సందేహం అందరిలోనూ ముసురుకుంది. 
 
అలాగని డేట్ వాయిదా వేస్తే, మొత్తం నేషనల్ మార్కెట్, ఓవర్‌సీస్ మార్కెట్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 6న విడుదల చేయాలని నిర్మాతలు నిశ్చయించినట్టుగా ఫిలిమ్‌నగర్ సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియాల బిజినెస్‌ని పూర్తి చేసేశారు. ఈ నెల 27న వైభవంగా హైదరాబాద్‌లో ‘తుఫాన్’ ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా రామ్‌చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలకాంశం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement