బాబాయ్‌కి చెర్రీ గిఫ్ట్‌ ఇదే..! | Ram Charan Special Gift To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Sep 2 2018 12:09 PM | Updated on Mar 22 2019 5:33 PM

Ram Charan Special Gift To Pawan Kalyan - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్‌ రామ్‌ చరణ్‌ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీ సాహసోపేతమైన పారాగ్లైడింగ్‌ చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన చరణ్ తరుపున ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘ప్రియమైన బాబాయ్‌.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్‌ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా - రామ్‌ చరణ్‌’ అంటూ ట్వీట్ చేశారు.

చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, ఆర్యన్ రాజేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement