అబ్బాయ్తో ఢీ అంటున్న బాబాయ్ | Ram Charan, Pawan Kalyan clash at the box office | Sakshi
Sakshi News home page

అబ్బాయ్తో ఢీ అంటున్న బాబాయ్

Jun 7 2016 11:28 AM | Updated on Mar 22 2019 5:33 PM

అబ్బాయ్తో ఢీ అంటున్న బాబాయ్ - Sakshi

అబ్బాయ్తో ఢీ అంటున్న బాబాయ్

మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటంలేదు. అంతలోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తారు. వెంటనే ఢీ అంటారు. ఇటీవల పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అంతా...

మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటంలేదు. అంతలోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తారు. వెంటనే ఢీ అంటారు. ఇటీవల పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటూ ప్రకటించే ప్రయత్నం చేసిన హీరోలు.., ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఢీ కొడుతున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అన్న చర్చ తెర మీదకు వచ్చింది.

ప్రస్తుతం తనీఒరువన్ రీమేక్గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ప్రారంభానికి ముందే దసరాకే సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. అనుకున్నట్టుగా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. బ్రూస్ లీ రిజల్ట్తో నిరాశ పరిచిన చరణ్, వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్తో పలకరించాలనుకుంటున్నాడు.

అయితే అదే సమయంలో బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఎస్జె సూర్య దర్శకత్వంలో సినిమా ప్రారంభించిన పవన్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా మూడు నెలల్లో పూర్తి చేసి విజయదశమికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించటంతో మరోసారి మెగా వార్ అన్న వార్తలు తెర మీదకు వచ్చాయి.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ కావటం కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. చరణ్ తన సినిమాతో పాటు, చిరు సినిమా నిర్మాణం కూడా చేస్తున్నాడు. దీంతో ధృవ ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ సినిమా ఇంకా మొదలే కాలేదు కాబట్టి మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం అసాధ్యం అంటున్నారు. మరి ఇవే కారణాలతో వెనక్కుతగ్గుతారా..? లేక బాబాయ్, అబ్బాయిలు ఢీ అంటారా..?  చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement