ఒప్పేసుకున్న రామ్‌ చరణ్‌..! | Ram Charan Open Letter To Fans On VVR | Sakshi
Sakshi News home page

మీ అంచనాలని అందుకోలేకపోయాం : రామ్‌చరణ్‌

Feb 5 2019 11:55 AM | Updated on Feb 5 2019 1:43 PM

Ram Charan Open Letter To Fans On VVR - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత చెర్రీ రొటీన్‌ మాస్‌ ఫార్ములా సినిమా చేయటం అభిమానులకు రుచించలేదు. అయితే మాస్‌ ఫార్ములా సినిమా కావటంతో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి.

తాజాగా వినయ విధేయ రామ రిజల్ట్‌పై చరణ్‌ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతఙన్యుడనై ఉంటానని తెలిపారు. అభిమానులను అలరించే సినిమా ఇచ్చేందుకు శ్రమించామన్న చెర్రీ, అంచనాలని అందుకోలేకపోయామని అంగీకరించారు. భవిష్యత్తులో మీరు మెచ్చే చిత్రాన్ని అందిస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement