చెమటోడుస్తున్న చరణ్‌

Ram Charan Getting In Shape For Boyapati Srinu Film - Sakshi

రంగస్థలం సినిమాతో రికార్డ్‌ లను తిరగరాస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన చెర్రీ ఈ నెలాఖరున షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే పనిలో ఉన్నాడు. రంగస్థలం సినిమాలో పల్లెటూరి యువకుడిగా మోటుగా కనిపించిన చరణ్‌, బోయపాటి సినిమాలో స్టైలిష్‌ లుక్‌ లో అలరించనున్నాడట.

అందుకు తగ్గట్టుగా ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. ఈ విషయాన్ని చరణ్‌ భార్య ఉపాసన ట్వీటర్‌ ద‍్వారా వెల్లడించారు. చాలా సేపు కసరత్తులు చేసి అలిసి పోయిన చెర్రీ ఫొటోతో పాటు ‘ఆర్‌సీ 12’ కోసం చరణ్‌ సిద్ధమవుతున్నాడంటూ ట్వీట్‌ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో దానయ్య నిర్మిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భరత్‌ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కియారా అద్వానీ రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top