పక్కా కమర్షియల్! | Ram Charan Dhruva Movie Commercial | Sakshi
Sakshi News home page

పక్కా కమర్షియల్!

Sep 26 2016 12:05 AM | Updated on Sep 4 2017 2:58 PM

పక్కా కమర్షియల్!

పక్కా కమర్షియల్!

అగ్ర దర్శకుల్లో సుకుమార్‌ది కాస్త విభిన్నమైన శైలి. తీసింది ఆరు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ

అగ్ర దర్శకుల్లో సుకుమార్‌ది కాస్త విభిన్నమైన శైలి. తీసింది ఆరు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. స్టోరీ, స్క్రీన్‌ప్లేలలో వైవిధ్యం చూపిస్తారాయన. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ‘సుకుమార్ ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’ అంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీవీ మోహన్.

 మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వీరు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ‘ధృవ’ షూటింగ్ పూర్తయిన వెంటనే నవంబర్‌లో ప్రారంభిస్తారట. త్వరలోనే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement