‘మజ్ను’పై రామ్‌చరణ్ కామెంట్..!

తన సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తన స్నేహితుడి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. సంక్రాంతి బరిలోకి వినయ విధేయ రామతో దిగగా.. అది చెర్రీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ విషయంలో కాస్త నిరాశ చెందిన చెర్రీ.. తాజాగా సోషల్ మీడియాలో అఖిల్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ గురించి కామెంట్ చేశాడు.
రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ ట్రైలర్‌ను చూసిన చెర్రీ.. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘లుక్స్ ప్రామిసింగ్.. అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, చిత్రబృందానికి ఆల్‌దిబెస్ట్’ చెబుతూ.. ట్రైలర్ లింక్‌ను షేర్ చేశారు. మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి