తప్పులుంటే క్షమించండి : రకుల్ | rakul preeth singh own dubbing for nannaku prematho | Sakshi
Sakshi News home page

తప్పులుంటే క్షమించండి : రకుల్

Jan 6 2016 1:35 PM | Updated on Jul 23 2019 11:50 AM

తప్పులుంటే క్షమించండి : రకుల్ - Sakshi

తప్పులుంటే క్షమించండి : రకుల్

ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ గట్టిపోటీ ఉన్నా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.

తను డబ్బింగ్ చెపుతుండగా తీసిన ఓ మేకింగ్ వీడియోను తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. మరో అడుగు ముందుకేసి ఈ తొలి ప్రయత్నంలో ఏమైన తప్పులు జరిగినా.. క్షమించండీ అంటూ అందరి మనసు గెలుచుకుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement