మందు పోయడం నేర్చుకున్నా

Rakul Preet turns bartender for 'De De Pyaar De' - Sakshi

పాత్రను బట్టి ప్రతి సినిమాకు హీరో, హీరోయిన్లు చాలా కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త విద్యలు నేర్చుకుంటారు. తన తాజా చిత్రం ‘దేదే ప్యార్‌ దే’ సినిమా కోసం బార్టెండింగ్‌ నేర్చుకున్నారట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బార్టెండింగ్‌ అంటే బార్‌లో సర్వ్‌ చేసే జాబ్‌.  అజయ్‌ దేవ్‌గన్, టబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దేదే ప్యార్‌దే’. టబుతో పెళ్లయిన అజయ్‌ దేవ్‌గన్‌ మళ్లీ రకుల్‌ని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అన్నది చిత్రకథ. ఈ సినిమా కోసం రకుల్‌ 8 కిలోల బరువు తగ్గటమే కాకుండా బార్టెండింగ్‌ కూడా నేర్చుకున్నారు.

కొత్త విద్య నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అయేషా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం కొన్ని వారాలు వర్క్‌షాప్‌కి వెళ్లాను. షేకర్స్‌ని ఎలా ఉపయోగించాలి, డ్రింక్స్‌ ఎలా కలపాలి, మిక్సర్స్‌ని కరెక్ట్‌గా ఎలా హ్యాండిల్‌ చేయాలనేవాటిపై శిక్షణ తీసుకున్నాను. గ్లాసుని గాల్లో ఎలా తిప్పాలి అనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా కనిపించాలి తప్పితే కొత్తగా అనిపించకూడదు. స్టార్టింగ్‌లో చేతిలో నుంచి గ్లాస్‌లు జారిపోతుండేవి తర్వాత మెల్లిగా హ్యాండిల్‌ చేయడం నేర్చుకున్నాను’’ అన్నారు. ‘దేదే ప్యార్‌దే’ సినిమా ఈనెల 17న విడుదలæ కాబోతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top