బిగ్‌బాస్‌ గేమ్‌ షోకు రకుల్‌ | Rakul Preet Singh to enter Bigg Boss Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ గేమ్‌ షోకు రకుల్‌

Jan 7 2018 9:21 AM | Updated on Jul 18 2019 1:55 PM

Rakul Preet Singh to enter Bigg Boss Show  - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొనడానికి రెడీ అవుతోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా?  అవకాశాలు లేనివారే ఇలాంటి గేమ్‌ షోల్లో పాల్గొంటారు కదాని, రకుల్‌ను ఆ లిస్ట్‌లో కట్టేస్తున్నారా? మరీ అంత తక్కువగా ఆలోచించకండి. ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే కానీ, చేతిలో అసలు చిత్రాలు లేకుండా మాత్రం లేదు లెండి. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన ఈ అమ్మడికి ఒక్కసారిగా అవకాశాలు పడిపోవడం ఊహించని పరిణామమే. అయితే  బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొననుండడం మాత్రం నిజంగా అదృష్టమే.

ఈ విషయాన్ని రకుల్‌నే స్వయంగా తన ఇన్‌స్ట్రాగాంలో పేర్కొంది. హిందీలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో మెరవనుంది. నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ గేమ్‌ షో సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. ఇక ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తాను నటించిన హిందీ చిత్రం ఐయ్యారీ ప్రమోషన్‌లో భాగంగా పాల్గొననుందట. ఈ సుందరి హిందీలో నటిస్తున్న ఐయ్యారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సిద్ధర్‌ మల్హోత్రా, మనోజ్‌బాజ్‌పాయ్‌ కలి సి నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ కథానాయకి.

 నీరజ్‌పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇకపోతే తమిళంలో సూర్యకు జంటగా నటించే అవకాశం పోయిందనే ప్రచారం వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అందు లో నిజం లేదట. నటి సాయిపల్లవి క«థానాయకిగా ఎంపిక కావడం, చిత్ర పూజా కార్యక్రమాల సందర్భంగా చిత్ర వర్గాలు రకుల్‌ ప్రస్థావన తీసుకురాకపోవడంతో చిత్రం నుంచి  ఈ అమ్మడు అవుట్‌ అనే ప్రచారం మొదలైంది.

 తాజాగా సూర్య 36వ చిత్రంలో తాను నటించనున్నానని, ఆ చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నానని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్స్‌ ఫిలింస్‌ సంస్థ అధినేతలు ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సంక్రాంతి పండగ అనంతరం ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement