దెయ్యాల అంతు చూసే రాజు.. | raju gari gadhi 2 updates | Sakshi
Sakshi News home page

దెయ్యాల అంతు చూసే రాజు..

Apr 15 2017 12:12 AM | Updated on Jul 15 2019 9:21 PM

దెయ్యాల అంతు చూసే రాజు.. - Sakshi

దెయ్యాల అంతు చూసే రాజు..

ముందూ వెనకా భటులు లేరు. ఒంటి మీద అభరణాలు లేవు. సూచనలు ఇచ్చేందుకు పక్కన మంత్రి లేడు.

ముందూ వెనకా భటులు లేరు. ఒంటి మీద అభరణాలు లేవు. సూచనలు ఇచ్చేందుకు పక్కన మంత్రి లేడు. ఒంటరిగానే రాజుగారు పల్లెటూళ్లోకి అడుగుపెట్టారు. అదేంటీ ఏ రాజైనా ఇలా ఉంటాడా? అనే డౌట్‌ రావచ్చు. ఈ రాజుగారు ఆ కాలం నాటి రాజు కాదు. ఈ కాలపు రాజు. స్టైలిష్‌ కింగ్‌. స్టైల్‌కి చిరునామా అన్నట్లుగా ఉండే నాగార్జున ఈ కింగ్‌ క్యారెక్టర్‌ చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది–2’.

ఈ కింగ్‌ దెయ్యాల అంతు చూస్తాడు. ఓకే ఎంటర్‌టైన్‌మెంట్స్, పీవీవీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. నాగ్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్‌కపూర్‌ కథానాయికలు. ఇటీవలే పాండిచ్చేరిలో షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పల్లెటూరి నేపథ్యంలో సాగే సీన్లు తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement