సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా..! | rajiniknath robo sequel to be postponed again | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా..!

May 16 2017 12:36 PM | Updated on Sep 5 2017 11:18 AM

సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా..!

సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా..!

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిదన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ ను ముందుగా 2017 దీపావళికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరింత సమయం ఇవ్వాలన్న ఆలోచనతో 2018 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే బాహుబలి 2 ఘనవిజయం సాధించటంతో గ్రాఫిక్స్ మీద మరింతగా దృష్టి పెట్టిన రోబో టీం సినిమాను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement