రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ | Rajinikanth's Twitter account hacked, handle retrieved hours later | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్

Aug 3 2016 1:28 PM | Updated on Aug 25 2018 6:49 PM

రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ - Sakshi

రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్

'కబాలి' స్టార్ రజనీకాంత్ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం రాత్రి హ్యాకింగ్ కు గురైంది.

ముంబై: రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ న్యూస్. 'కబాలి' స్టార్ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం రాత్రి హ్యాకింగ్ కు గురైంది. ఆయన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి 'రజనీకాంత్ హిట్ టు కిల్' ట్వీట్ రావడంతో అభిమానులు కంగారు పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తర్వాత గుర్తించారు. కొన్ని గంటల తర్వాత ఈ విషయాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.ఆర్.ధనుష్ ధ్రువీకరించారు. ఇప్పుడు తన తండ్రి ఖాతాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. అంతా సవ్యంగా ఉందని అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

2013, ఫిబ్రవరిలో ట్విట్టర్ ఖాతా తెరిచిన రజనీకాంత్ కేవలం 23 మందిని మాత్రమే అనుసరిస్తున్నారు. కమల్ హాసన్, ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, పా రంజిత్, కళైపులి ఎస్ థాను వంటి ప్రముఖులను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఆయనకు ట్విట్టర్ లో 30 లక్షల మందిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement