పేట్టలో వేట

Rajinikanth's new movie titled 'Petta', check out the official motion poster - Sakshi

గంటల వ్యవధిలో ఒకే రోజు డబుల్‌ ధమాకా ఇచ్చారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అటు ‘2.0’ టీజర్, ఇటు తాజా సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, మాళవికా మోహనన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరి.. ‘పేట్ట’లో రజనీకాంత్‌ విలన్స్‌ని ఎలా వేటాడతారు? అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచి... ‘2.0’ విషయానికి వస్తే... శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య పాత్రలుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top