ఫస్ట్‌వీక్‌లో దర్బార్‌ వసూళ్ల సునామీ..

Rajinikanths Darbar Completed Its First Week In Theatres At The Worldwide Box Office - Sakshi

హైదరాబాద్‌ : సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్‌ దర్బార్‌ తొలి వారంలో రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో ఫస్ట్‌వీక్‌లో ఏకంగా రూ 60 కోట్ల వరకూ రాబట్టింది. తమిళనాడులో 650కి పైగా స్ర్కీన్స్‌లో రిలీజైన దర్బార్‌ తొలిరోజే రూ 18 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి సెలవల కారణంగా తమిళనాడులో దర్బార్‌ భారీ వసూళ్లతో సత్తా చాటింది. చెన్నైలో తొలి వారంలో రూ 10 కోట్ల మార్క్‌ను దాటింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ టాక్‌తో ఈ మూవీ రూ 15 కోట్లుపైగా కలెక్ట్‌ చేసింది. సరిలేరు, అల వైకుంఠపురంలో వంటి భారీ సినిమాల నుంచి పోటీ ఎదురైనా ఈ స్ధాయి వసూళ్లను దర్బార్‌ రాబట్టడం విశేషమే. కేరళలో రూ 7 కోట్లు, కర్ణాటకలో రూ 14 కోట్లు, రెస్టాఫ్‌ఇండియాలో రూ 4 కోట్లుపైగా వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా రూ 100 కోట్లు కలెక్ట్‌ చేసిన దర్బార్‌ అమెరికాలో రూ 10 కోట్లు, గల్ఫ్‌లో రూ 11 కోట్లు రాబట్టింది. విదేశీ వసూళ్ల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడైతే దర్బార్‌ వసూళ్లు ఓ రేంజ్‌లో ఉంటాయని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి : దర్బార్‌ చిత్రంలో నయనతార పాత్ర దారుణం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top