నేను బాగానే ఉన్నాను: రజనీకాంత్‌

Rajinikanth Reaction On Man vs Wild Shooting - Sakshi

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షూటింగ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గాయాలయ్యాయి. రజనీకాంత్‌ ఆయన రెండో కూతురు సౌందర్యతో కలిసి సోమవారం కర్ణాటక మైసూరు సమీపంలోని బందిపూర్‌కు వెళ్లారు. అక్కడ బందీపూర్​ నేషనల్​ పార్క్‌లో బేర్‌ గిల్స్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం షూటింగ్‌లో తలైవా భుజాలకు స్పల్ప గాయాలైనట్లు, యాంకిల్‌ బెణికినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కొంత సమయం విరామం తర్వాత షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. (ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ బియ‌ర్ గ్రిల్స్‌)

కాగా దీనిపై రజనీ స్పందించారు. చిన్న ముళ‍్ల కారణంగా శరీరంపై కొన్ని గీతలు ఏర్పడ్డాయని, అంతేగానీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని షూటింగ్‌ అనంతరం చైన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో బేర్‌ గ్రిల్స్‌. ఈ కార్యక్రమంలో ఇప్పటికే గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి పయనించిన విషయం తెలిసిందే. మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌లో కనిపించిన రెండవ భారతీయ వ్యక్తిగా రజనీ నిలిచారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top