రాజకీయం చేయకండి

Rajinikanth Reaction on Kashmir Issue - Sakshi

పెరంబూరు: దేశ భద్రతకు చెందిన వ్యవహారాన్ని రాజకీయం చేయరాదు. అలా చేసేవారు మూర్ఖులు  అని నటుడు రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో కశ్మీర్‌ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోది, అమిత్‌షా ఎంతో రాజతంత్రంతో వ్యవహరించారని ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్‌ చేసిన ఆ వ్యాఖ్యలు పెద్ద చర్చలే దారి తీశాయి. ఆ వ్యాఖ్యలను స్వాగతించిన వారూ ఉన్నారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. కాగా బుధవారం నటుడు రజనీకాంత్‌ చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ కళ్మీర్‌ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. కళ్మీర్‌ భారతదేశంలోని తీవ్రవాదులను పెంపొందించేదిగానూ, మాతృభూమిగానూ నెలకొందన్నారు.

కాబట్టి ఈ వ్యవహారాన్ని రాజతంత్రంతో అమిత్‌షా, మోది పరిష్కరించారని అన్నారు. మోదిని, అమిత్‌షాను కృష్ణార్జునులుగా పోల్చడం గురించి అడిగిన ప్రశ్నకు కృష్టుడు సలహా ఇస్తాడని, అర్జునుడు దాన్ని ఆచరిస్తాడని అన్నారు. అలా రాజతంత్రంతో వ్యవహరించడం వల్లే  మోది, అమిత్‌షాలను తాను అలా పోల్చానని వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకండి. అలా చేయకూడదు కూడా అని కొందరు రాజకీయనాయకులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దేశ భద్రతకు చెందిన వ్యవహారాన్ని రాజకీయం చేయరాదని అన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలో తమిళసినిమాకు అవార్డులు రాకపోవడం బాధనిపించిందన్నారు. ఈ విషయంలో అవార్డుల కమిటీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇక తన రాజకీయ పార్టీ ప్రకటన తమిళ రాజకీయాలుగా పోయెగార్డెన్‌ మారుతుందా అన్నది వేచి చూడండి అని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top