రజనీ దర్బార్‌

Rajinikanth Next Movie is Darbar by AR Murugadoss - Sakshi

లాఠీ పట్టి నేరగాళ్ల భరతం పట్టడానికి రజనీకాంత్‌ ఖాకీ డ్రెస్‌ వేసి పోలీస్‌గా మారారు. రజనీకాంత్‌ హీరోగా ‘గజిని, తుపాకి, కత్తి’ చిత్రాల ఫేమ్‌ ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్‌లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి వర్క్‌ చేస్తున్నారు మురుగదాస్‌. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి (2005), కథానాయకుడు (2008)’ సినిమాల్లో రజనీకాంత్‌తో కలిసి సిల్వర్‌స్క్రీన్‌ను షేర్‌ చేసుకున్నారు నయనతార. ఇక ‘దర్బార్‌’ ఫస్ట్‌ లుక్‌ను బట్టి ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

దాదాపు ఇరవైఏళ్ల తర్వాత పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారట రజనీ. అలాగే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌లో ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ కనిపిస్తోంది. సో.. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథాంశమని కన్ఫార్మ్‌ చేసుకోవచ్చు. మురుగదాస్‌ ‘తుపాకీ’, రజనీకాంత్‌ ఇటీవలి ‘కాలా’ చిత్రాలు ముంబై నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ‘దర్బార్‌’ చిత్రానికి అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రాహకులు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్‌ గత చిత్రం ‘పేట’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top