పండగే పండగ | Rajinikanth Next With Director Siva | Sakshi
Sakshi News home page

పండగే పండగ

Aug 22 2019 2:58 AM | Updated on Sep 12 2019 10:40 AM

Rajinikanth Next With Director Siva - Sakshi

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్‌’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రజనీ తర్వాతి చిత్రం ఏంటీ? అనే చర్చ మొదలైంది. రజనీకాంత్‌ తర్వాతి సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నారట. ఇంతకుముందు అజిత్‌తో ‘వేదాలం, వీరమ్, వివేగమ్, విశ్వాసం’ వంటి మాస్‌ సినిమాలు తీశారు శివ. రజనీకాంత్‌కు కూడా ఆయన ఓ మాస్‌ స్టోరీని చెప్పారని, వీరి కాంబినేషన్‌లో సినిమా ఆల్మోస్ట్‌ ఒకే అయిపోయిందని చెన్నై టాక్‌. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కోడంబాక్కమ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే.. రజనీ అభిమానులకు వచ్చే ఏడాది డబుల్‌ ధమాకాయే. సంక్రాంతికి ఒక సినిమా, దీపావళికి ఒక సినిమా అంటే అభిమానులకు పండగే కదా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement