రజనీకాంత్ ఒక్క ట్వీట్ ఇస్తే.. ఇక వంద ట్వీట్స్! | Rajinikanth makes Twitter debut | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ ఒక్క ట్వీట్ ఇస్తే.. ఇక వంద ట్వీట్స్!

May 5 2014 3:14 PM | Updated on Sep 2 2017 6:58 AM

రజనీకాంత్ ఒక్క ట్వీట్ ఇస్తే.. ఇక వంద ట్వీట్స్!

రజనీకాంత్ ఒక్క ట్వీట్ ఇస్తే.. ఇక వంద ట్వీట్స్!

ట్విటర్ లో ట్వీట్స్ తో హోరెత్తే అవకాశం కనిపిస్తొంది. ఎందుకంటే ఇక నుంచి రజనీకాంత్ ఇచ్చే ఒక్క ట్వీట్ వంద ట్వీట్స్ గా మారనున్నాయి

చెన్నై: ట్విటర్ లో ట్వీట్స్ తో హోరెత్తే అవకాశం కనిపిస్తొంది. ఎందుకంటే ఇక నుంచి రజనీకాంత్ ఇచ్చే ఒక్క ట్వీట్ వంద ట్వీట్స్ గా మారనున్నాయి.  దానికి అభిమానులను రీట్వీట్ ఇస్తే ఇంకా ఆలోచించడానికి కష్టమే. ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విటర్ లో ఆరంగేట్రం చేశారు. తాజాగా రజనీకాంత్ @SuperStarRajini అనే పేరుతో ట్విటర్ లో అకౌంట్ తెరిచారు. 
 
ట్విటర్ లో అకౌంట్ తెరువాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే విషయాలను ట్విటర్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం అని రజనీ అన్నారు. అంతేకాకుండా నా అభిమానులతో తన ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి సులభంగా కూడా ఉంటుందని రజనీ తెలిపారు. 
 
రజనీకాంత్ నటించిన కొచ్చడయాన్ చిత్రం మే 9 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రానికి ఆయన కూతురు సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement