యాక్షన్‌ పార్ట్‌ను కంప్లీట్‌ చేసిన తలైవా! | Rajinikanth And Karthik Subbaraju Movie Completes Action Part Shooting | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 7 2018 3:12 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

Rajinikanth And Karthik Subbaraju Movie Completes Action Part Shooting - Sakshi

యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ ఈ పోరాట సన్నివేశాల్ని కంపోజ్‌ చేశారు

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘కాలా’ అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇలా వరుసగా సూపర్‌స్టార్‌ రజనీ సినిమాలు నిరాశ పరచడంతో రాబోయే సినిమాతో అభిమానుల కోరిక తీర్చాలని ఆశిస్తున్నారు సూపర్‌స్టార్‌. అందుకే యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించాడు తలైవా. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని సమాచారం.

దాదాపు 25రోజుల పాటు డార్జిలింగ్‌లో జరిగిన ఈ షెడ్యుల్‌లో యాక్షన్‌ సీన్స్‌ను  చిత్రీకరించినట్టు తెలుస్తోంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ ఈ పోరాట సన్నివేశాల్ని కంపోజ్‌ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీ సరసన సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ నటించనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement